Samsung Galaxy M15 5G: రూ. 10,299కే సామ్‌సంగ్ 5G పోన్.. అలాంటి ఇలాంటి ఆఫర్ కాదుగా.. బెస్ట్ డీల్ అవ్వొచ్చు..!

Samsung Galaxy M15 5G: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ. 10,299కి కొనుగోలు చేయవచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 24 Sept 2024 8:37 PM IST
Samsung Galaxy M15 5G
X

Samsung Galaxy M15 5G

Samsung Galaxy M15 5G: టెక్ కంపెనీ సామ్‌సంగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. గ్లోబల్ మార్కెట్‌లో సామ్‌సంగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సామ్‌సంగ్ బ్రాండ్‌లో బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అనేక రకాలు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే మీరు దీపావళికి ముందు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే మీకో శుభవార్త ఉంది.

సామ్‌సంగ్ Galaxy M15 5G ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ఫోన్ చౌకగా లభిస్తుంది. కాబట్టి మీరు పెద్ద బ్యాటరీ, మంచి కెమెరాతో ఈ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే ఫోన్‌ని విష్‌లిస్ట్ చేయండి. ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy M15 5G Offer
అమెజాన్ టీజ్ చేసిన పోస్ట్ ప్రకారం Galaxy M15 5G అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 10,299కి అందుబాటులో ఉంటుంది. కంపెనీ రూ. 13,499 బేస్ ధరతో ఈ ఫోన్ లాంచ్ చేసింది. దీని నుండి మీకు ఈ ఫోన్‌పై రూ. 3200 డిస్కౌంట్ లభిస్తుంది. బ్లూ టోపాజ్, స్టోన్ గ్రే, సెలెస్టియల్ బ్లూ కలర్స్‌లో ఈ సామ్‌సంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M15 5G Features
డిస్‌ప్లే గురించి చెప్పాలంటే ఈ Samsung ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంది. ఈ Samsung ఫోన్‌లో octa core MediaTek Dimensity 6100+ చిప్‌సెట్ ఉంది.

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ Samsung Galaxy M15 5Gలో అందుబాటులో ఉంది.ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెకండరీ సెన్సార్, 2MP షూటర్ ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే ఈ 5G ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story