Amazon Offers: అదిరే ఆఫర్.. వేరీ చీప్ ధరకే సామ్‌సంగ్ ప్రీమియం ఫోన్..!

Amazon Offers
x

Amazon Offers: అదిరే ఆఫర్.. వేరీ చీప్ ధరకే సామ్‌సంగ్ ప్రీమియం ఫోన్..!

Highlights

Amazon Offers: సామ్‌సంగ్ కొన్ని వారాల క్రితం తన తాజా Galaxy S25 Ultraని విడుదల చేసింది. ఈ కొత్త లాంచ్ తర్వాత గతేడాది విడుదల చేసిన Galaxy S24 Ultra ధరను భారీగా తగ్గించింది.

Amazon Offers: సామ్‌సంగ్ కొన్ని వారాల క్రితం తన తాజా Galaxy S25 Ultraని విడుదల చేసింది. ఈ కొత్త లాంచ్ తర్వాత గతేడాది విడుదల చేసిన Galaxy S24 Ultra ధరను భారీగా తగ్గించింది. ఇప్పుడు అమెజాన్ ఈ ఫోన్‌పై చాలా మంచి ఆఫర్‌ను అందిస్తోంది. మీరు 1 లక్ష రూపాయల లోపు ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 1,34,999కి విడుదల చేసింది. అయితే ప్రస్తుతం చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 Ultra Offers

సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాని రూ.1,34,999కి విడుదల చేయగా.. ఆ తర్వాత ధర రూ. 1,15,000కి తగ్గించింది. అయితే ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 1,01,000కి అందుబాటులో ఉంది. ఫోన్‌పై 12శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. అంటే మీరు ఫోన్‌పై రూ. 14,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ సామ్‌సంగ్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం అదనపు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. మీకు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే రు రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లతో ధర రూ.99 వేలకు తగ్గింది. అమెజాన్ ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.48,600 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

Samsung Galaxy S24 Ultra Specifications

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో QHD+ 6.8-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ఉంది. కెమెరా కోసం ఫోన్‌లో 200MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది.

ఇందులో 50MP పెరిస్కోప్ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 12MP కెమెరా ఫ్రంట్ కెమెరా ఉంది. S24 అల్ట్రాలో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories