iPhone 13 Offer: ఐఫోన్ 13 ఆఫర్.. ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Nov 2024 10:01 PM IST
iPhone 13 Offer: ఐఫోన్ 13 ఆఫర్.. ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్
X

iPhone 13 Offer: ఇటీవలే దీపావళి సందర్భంగా అనేక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలలో బెస్ట్ డీల్స్ అందించాయి. జీవితంలో ఎన్నడూ చూడని ఆఫర్లను ఐఫోన్‌‌లపై అందించాయి. కొంతమంది ఆ షాపింగ్ ఆఫర్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ఇంకొంతమంది ఆ ఆఫర్స్ మిస్ అయ్యారు. అయితే, ఆ ఆఫర్ మిస్ అయిన వాళ్లు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇప్పటికీ కొన్ని భారీ డిస్కౌంట్ డీల్స్ అందిస్తోంది. iPhone 13 పై ఇప్పటికీ కేవలం రూ. 45,499 ధరకే అందుబాటులో ఉంది.

iPhone 13పై తగ్గింపు ఆఫర్

ఈ మొబైల్ ప్రస్తుతం ఎటువంటి ఆఫర్ లేకుండా కేవలం రూ. 45,499కి అందుబాటులో ఉంది. కంపెనీ దీన్ని రూ. 79,900కి లాంచ్ చేసింది. ఎటువైపు చూసినా దాదాపు సగం ధరకే ఫోన్ లభిస్తుంది. విశేషమేమిటంటే ఫోన్‌లో నో కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ మీరు నెలకు రూ. 2,048.74 EMIతో ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. ఇది మాత్రమే కాకుండా మీరు అదనపు డబ్బు ఆదా చేసేలా ఫోన్‌లో కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఎంత మేరకు ఈ తగ్గింపు లభిస్తుందనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఐఫోన్ 13లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను అమర్చారు. ఫోన్‌లో ప్రత్యేకమైన సినిమాటిక్ మోడ్ కూడా ఉంది. దీనిలోని అధునాతన డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఫోన్‌ను మరింత ప్రత్యేకం చేస్తుంది. దీనిలో రెండు 12MP కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఉన్న స్మార్ట్ HDR 4, నైట్ మోడ్, 4K డాల్బీ విజన్ HDR ఫీచర్స్ రికార్డింగ్‌కు అనువుగా ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 12MP TrueDepth ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది ప్రత్యేకంగా నైట్ మోడ్, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఫోన్‌ పర్‌ఫార్మెన్స్ పెంచడానికి ఇందులో A15 బయోనిక్ చిప్ ఉపయోగించారు. ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని యాపిల్ చెబుతోంది. ఇది మాత్రమే కాదు, లేటెస్ట్ iOS 18 వెర్షన్ కూడా ఈ ఐఫోన్‌లో అందుబాటులో ఉంది. యాపిల్ ఈ ఐఫోన్‌కు లేటెస్ట్ అప్‌డేట్స్ అందిస్తుందని చెబుతున్నారు. మొత్తంమీద ఈ ఐఫోన్ 13 ప్రస్తుతానికి రూ. 45,499 కే లభిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story