Alert: ఏసీ వాడేవారికి అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేస్తే పేలిపోయే ప్రమాదం..!

Alert for AC Users There is a Risk of Explosion if you Make These Mistakes
x

Alert: ఏసీ వాడేవారికి అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేస్తే పేలిపోయే ప్రమాదం..!

Highlights

Alert: ఎండాకాలంలో చల్లదనం కోసం ఏసీలని ఎక్కువగా వాడుతారు. ఇవి కొంచెం ఖరీదైనవి కాబట్టి ధనవంతులు మాత్రమే ఇళ్లలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటారు.

Alert: ఎండాకాలంలో చల్లదనం కోసం ఏసీలని ఎక్కువగా వాడుతారు. ఇవి కొంచెం ఖరీదైనవి కాబట్టి ధనవంతులు మాత్రమే ఇళ్లలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటారు. అంతేకాకుండా వివిధ రకాల కార్యాలయాల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. స్ప్లిట్ ఎయిర్ కండీషనర్‌లతో పోలిస్తే విండో ఎయిర్ కండిషనర్లు గదిని తొందరగా చల్లబరుస్తాయి. ఇందులో అన్ని భాగాలు ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయి. అయితే కొంతమంది వినియోగదారులు ఎయిర్ కండీషనర్‌ల మెయింటనెన్స్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు ఎయిర్ కండీషనర్‌లో పేలుడు కూడా సంభవించవచ్చు. ఈ రోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

సర్వీసింగ్‌లో నిర్లక్ష్యం

ఎయిర్ కండీషనర్‌ను సర్వీసింగ్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దానిలో అనేక సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యల కారణంగా ఎయిర్ కండీషనర్‌లో పేలుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి సర్వీసింగ్ లేకపోవడం వల్ల ఎయిర్ కండీషనర్ కంప్రెసర్లో ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో పేలుడు సంభవిస్తుంది.

లీకేజీ కారణంగా పేలుడు

ఎయిర్ కండీషనర్‌లో లీకేజీ కారణంగా కూడా పేలుడు సంభవిస్తుంది. వాస్తవానికి ఎయిర్ కండీషనర్‌లోని శీతలీకరణ పైపులలో ఒక్కోసారి గ్యాస్‌ లీకేజ్ అవుతుంది. ఏదైనా స్పార్క్ ఏర్పడినప్పుడు పేలుడుకు కారణమవుతుంది. అందుకే ఎక్కువకాలం ఉపయోగించిన పైపులని మార్చుకోవడం ఉత్తమం.

గ్యాస్‌ చెక్‌ చేయించాలి

సమ్మర్ సీజన్‌లో ఏసీని రన్ చేసే ముందు ముందుగా గ్యాస్ చెక్ చేయించుకోవాలి. గ్యాస్ లేకపోయినా ఏసీ వాడితే మొత్తం పాడవుతుంది. అలాగే ఏసీ కంప్రెసర్ కూడా బాగుండటం అవసరం. దీని ప్రయోజనం ఏంటంటే ఇది కూలింగ్ కాయిల్‌ను పూర్తిగా శుభ్రపరుస్తుంది. దీనివల్ల శీతలీకరణ పెరుగుతుంది. ఏసీలో కూలింగ్ కాయిల్ ముందు ఎయిర్ ఫిల్టర్లు అమర్చబడి ఉంటాయి. ఇవి పూర్తిగా శుభ్రంగా ఉండటం చాలా అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories