Airtel: ఎయిర్‌టెల్‌ చౌకైన ప్లాన్.. ఏడాది పొడవునా అపరిమిత కాల్స్‌, డేటా ప్రయోజనాలు..!

Airtel Cheapest Plan Unlimited Calls and Data Benefits Throughout the Year
x

Airtel: ఎయిర్‌టెల్‌ చౌకైన ప్లాన్.. ఏడాది పొడవునా అపరిమిత కాల్స్‌, డేటా ప్రయోజనాలు..!

Highlights

Airtel: ఎయిర్‌టెల్ కొత్త సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు అనేక రకాల వార్షిక ప్లాన్‌లను అందిస్తుంది.

Airtel: ఎయిర్‌టెల్ కొత్త సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు అనేక రకాల వార్షిక ప్లాన్‌లను అందిస్తుంది. కేవలం రూ. 1,799తో ఏడాది పొడవునా అపరిమిత కాల్స్‌, డేటా ప్రయోజనాలు అందిస్తోంది. దీనివల్ల పదే పదే రిఛార్జ్‌ చేసుకునే బాధ తప్పుతుంది. దీంతో సంవత్సరంలో 365 రోజులు టెన్షన్ లేకుండా ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్ గురించి వివరాలు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ 1799 ప్లాన్

ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్ రూ. 1,799కే వస్తోంది. ఈ ప్లాన్ కింద సంవత్సరానికి మొత్తం 24 GB డేటా అందుతుంది. అపరిమిత స్థానిక జాతీయ కాలింగ్ సేవలు లభిస్తయి. ఈ ప్లాన్ తక్కువ డేటాను ఉపయోగించే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎయిర్‌ టెల్‌ రూ.1799 ప్లాన్‌లో 3600 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తుంది. అంతేకాదు హెలోట్యూన్, వింక్ మ్యూజిక్ హెలోట్యూన్‌లు పాటలను వినడానికి ఉచిత సభ్యత్వాన్ని అందిస్తాయి.

ఇది మాత్రమే కాదు ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్ అందుతుంది. మీరు సంవత్సరం ముగిసేలోపు 24 GB డేటాను పూర్తి చేస్తే మీకు అదనపు డబ్బు ఛార్జ్ చేస్తారు. ఇందులో ప్రతి ఎంబీకి 50 పైసలు వసూలు చేస్తారు. ఎయిర్‌టెల్ మాదిరిగానే వొడాఫోన్ ఐడియా, జియో కూడా తమ వినియోగదారులకు వార్షిక ప్లాన్‌లను అందిస్తున్నాయి. వొడాఫోన్‌ చౌకైన వార్షిక ప్లాన్ రూ. 1,799కి వస్తుంది. ఇది కాకుండా జియో చౌకైన వార్షిక ప్లాన్ రూ. 1,559కి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories