Airtel: ఎయిర్‌టెల్‌ 35 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్.. ప్రయోజనాలు ఏంటంటే..?

Airtel 35 Plan Check for all Details
x

Airtel: ఎయిర్‌టెల్‌ 35 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్.. ప్రయోజనాలు ఏంటంటే..?

Highlights

Airtel: ఎయిర్‌టెల్‌ 35 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్.. ప్రయోజనాలు ఏంటంటే..?

Airtel: ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం చాలా ప్లాన్‌లను కలిగి ఉంది. తాజాగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం చౌక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర రూ. 35. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ప్రస్తుతం కంపెనీ అధికారిక సైట్‌లో కనిపించడం లేదు. కానీ కంపెనీ మొబైల్ యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రూ. 35 ధర కలిగిన ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ మీకు డేటాను మాత్రమే అందిస్తుంది.

అంటే మీరు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే కాల్ లేదా SMS చేసే సౌకర్యం లభించదు. మీ ప్రస్తుత ప్లాన్‌లో అందుబాటులో ఉన్న డేటా ముగిసినప్పుడు మాత్రమే ఈ ప్లాన్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం డేటాను మాత్రమే అందిస్తుంది. ఈ 35 రూపాయల ప్లాన్ గురించి మాట్లాడినట్లయితే మీకు 2 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ మీకు 2 GB డేటాను అందిస్తుంది. మరోవైపు కంపెనీ రూ. 19 డేటా ప్లాన్‌ను కూడా కలిగి ఉంది.

ఎయిర్‌టెల్ 19 రూపాయల ప్లాన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు 1 రోజు వ్యాలిడిటీ, 1 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఎయిర్‌టెల్ రూ. 35 డేటా ప్లాన్‌ 1 GB లేదా 3 GB డేటాకు బదులుగా 2 GB డేటా కావాలనుకునే వారు ఇష్టపడుతారు. ఎయిర్‌టెల్ 3 GB డేటా ప్లాన్ ధర రూ. 58తో వస్తుంది. డేటా అధికంగా ఉపయోగించేవారికి ఈ ప్లాన్‌లు బాగా ఉపయోగపడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories