అతి తక్కువ ధరకే 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ.. ఎక్కడంటే..?

32 Inch Smart LED TV for Just Rs.6,999 Check for all Details
x

అతి తక్కువ ధరకే 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ.. ఎక్కడంటే..?

Highlights

32 Inch HD LED TV: దీపావళి పండగ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో చాలామంది ఎలక్ట్రిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనడానికి మొగ్గుచూపుతారు.

32 Inch HD LED TV: దీపావళి పండగ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో చాలామంది ఎలక్ట్రిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనడానికి మొగ్గుచూపుతారు. ఇందులో ముఖ్యంగా టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్‌లాంటివి ఉంటాయి. అలాగే వివిధ ఆన్‌లైన్‌ కంపెనీలు కూడా టెంప్ట్‌ చేసే ధరలని ప్రకటిస్తాయి. అయితే తాజాగా ఒక స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ గురించి మాట్లాడుకుందాం. ఇది అతి తక్కువ ధరలో మంచి ఫీచర్లని కలిగి ఉంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కోడాక్ కంపెనీ 32-అంగుళాల HD LED TVని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో విక్రయిస్తున్నారు. దీని ధర చాలా తక్కువగా ఉంది. ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కంటే తక్కువని చెప్పవచ్చు. కస్టమర్‌లు కేవలం రూ.6,999కి కొనుగోలు చేయవచ్చు కానీ దీని వాస్తవ ధర ₹10,999. ఈ టీవీపై దాదాపు 60% డబ్బులు ఆదా చేయవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే ఈ HD LED TV 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది.

అలాగే కస్టమర్‌లు 60 Hz రిఫ్రెష్ రేట్‌ను పొందుతారు. అంతేకాదు వినియోగదారులు ఇందులో రెండు HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లను కూడా పొందుతారు. మొత్తంమీద టీవి కొనుగోలు చేసేవారికి ఇది మంచి ఎంపికని చెప్పవచ్చు. ఇంత తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు ఉన్న టీవి దొరకడం కష్టమనే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories