యువీ ఈజ్ బ్యాక్.. ఫ్యాన్స్‌కు పండగే

Arun Chilukuri
Updated on: 16 Dec 2020 4:14 PM IST
యువీ ఈజ్ బ్యాక్.. ఫ్యాన్స్‌కు పండగే
X

యువరాజ్‌ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్. అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే నెల ప్రారంభం కానున్న దేశవాళీ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సిక్సర్లతో అలరించడానికి రెడీ అవుతున్నాడ్. గతేడాది జూన్‌లో అతడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ పంజాబ్‌ క్రికెట్ అసోసియేషన్‌ కార్యదర్మి పునీత్‌ సంప్రదించడంతో తన సొంత రాష్ట్రం కోసం తిరిగి ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దేశవాళీ టీ20 ట్రోఫీకి పంజాబ్‌ జట్టులోని 30మంది ప్రాబబుల్ ఆటగాళ్ల జాబితాలో యువరాజ్‌ పేరు నమోదైంది. ఈ మధ్యే 40వ వసంతంలోకి అడుగుపెట్టిన యవీ పరోక్షంగా ఈ విషయాన్ని తన అభిమానులకు చెప్పాడు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నాడు. వీడియోలో యువీ మైదానంలో బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story