ఢిల్లీలో రైతుల ఆందోళన : పుట్టిన రోజు వేడుకలకి యువరాజ్ దూరం!

ఢిల్లీలో రైతుల ఆందోళన : పుట్టిన రోజు వేడుకలకి యువరాజ్ దూరం!
x
Highlights

టీమ్‌ఇండియా మాజీ అల్ రౌండర్ యువరాజ్‌సింగ్‌ నేడు (శనివారం) తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకునే యువీ ఈ సారి మాత్రం పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉన్నాడు

టీమ్‌ఇండియా మాజీ అల్ రౌండర్ యువరాజ్‌సింగ్‌ నేడు (శనివారం) తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకునే యువీ ఈ సారి మాత్రం పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉన్నాడు.అయితే దీనిపైన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న తానూ ఈ నిర్ణయం తీసుకుకున్నట్టుగా యువీ వెల్లడించాడు. దేశానికి రైతులే జీవనాధారం అని, శాంతియుతంగా చర్చిస్తే అన్నింటికీ సమస్యలు పరిష్కారం అవుతాయని యువీ వెల్లడించాడు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా యువీ పేర్కొన్నాడు.

ఇక యువరాజ్‌సింగ్‌ క్రికెట్ కెరీర్ విషయానికి వచ్చేసరికి 19 ఏళ్లకే ఇండియన్ క్రికెట్ జెర్సీ ధరించి జట్టులో స్థానం సంపాదించాడు యువీ.. ఆ తరవాత తన అద్భుతమైన ఆటతో జట్టులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2007 ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండు జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆ దేశ జట్టు బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా చరిత్ర సృష్టించాడు.

2007టీ 20 ప్రపంచ కప్ , 2011 వరల్డ్ కప్ భారత్ సాధించడంలో యువీదే కీలక పాత్ర కావడం విశేషం. ఇక టీ20 పొట్టి క్రికెట్లో తక్కువ బంతుల్లో(12) అర్ధ శతకం సాధించిన ఘనత ఇప్పటికి యువరాజ్ పైనే వుంది. గత ఏడాది అన్ని ఫార్మేట్లకు గుడ్ బై చెప్పాడు యువీ!

Show Full Article
Print Article
Next Story
More Stories