IPL 2020: భార‌త 'యువ' కెరటాలు

IPL 2020: భార‌త యువ కెరటాలు
x

ipl

Highlights

IPL 2020: ఒక్క ఛాన్స్‌దొరికితే చాలు ఆట గ‌తినే మార్చే ఆట‌గాళ్లు. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న ఆట‌గాళ్లు ఎంద‌రో ఉన్నారు. క్రికెట్ పూర్తిగా వ్య‌‌క్తిగ‌త ప్ర‌తిభ ఆధారప‌డి ఉంటుంది. మైదానంలోకి దిగిన ఆడ‌గాడు బ్యాటింగ్‌తోనో.. బౌలింగ్‌తోనో త‌మ ప్ర‌తిభ‌ను చూపిన సంద‌ర్భాలు

IPL 2020: ఒక్క ఛాన్స్‌దొరికితే చాలు ఆట గ‌తినే మార్చే ఆట‌గాళ్లు. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న ఆట‌గాళ్లు ఎంద‌రో ఉన్నారు. క్రికెట్ పూర్తిగా వ్య‌‌క్తిగ‌త ప్ర‌తిభ ఆధారప‌డి ఉంటుంది. మైదానంలోకి దిగిన ఆడ‌గాడు బ్యాటింగ్‌తోనో.. బౌలింగ్‌తోనో త‌మ ప్ర‌తిభ‌ను చూపిన సంద‌ర్భాలు చాల‌నే ఉన్నాయి. ఇక ఐపీఎల్ అంటే చెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రంలేదు. అదో సూప‌ర్ స్టార్ల ఆట‌. అంత‌ర్జాతీయ మేటీ ఆట‌గాళ్ల‌తో క‌లిసి ఆడి.. త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకునే వేదిక‌. ఇలా తామను తాము నిరూపించుకుని.. యు వ ఆట‌గాళ్లుగా మారిన వారెంద‌రో ఉన్నారు. ఏఏ జ‌ట్టు త‌రుపున భార‌త యువ క్రికెట‌ర్లు బారిలో దిగుతున్నారో చూద్దాం..

య‌శస్వీ జైశ్వాల్‌(రాజ‌స్థాన్)

య‌శస్వీ జైశ్వాల్‌.. యూపీలో జ‌న్మించి.. ఢిల్లీలో స్థిర ప‌డ్డ 18 ఏండ్ల జైశ్వాల్‌. ఈ ఏడాది భార‌త త‌రుపున అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్‌ లో ఆడి.. టాప్ స్కోర‌ర్‌గా నిలిచారు. దేశ‌వాలీ క్రికెట్ ముంబాయి జ‌ట్టుకు ప్ర‌తినిథ్యం వ‌హించి.. అనేక రికార్డులను త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇత‌ని స‌గ‌టు 71.81 కాగా.. అందులో ఓ డ‌బుల్ సెంచ‌రీ కూడా ఉంది. రాజ‌స్థాన్ తుది జ‌ట్టులో అతనికి స్థానం ఖాయం.

అబ్దుల్ సామాద్( స‌న్‌రైజ‌ర్‌)

అబ్దుల్ సామాద్ జ‌మ్మూకాశ్మీర్ చెందిన 19 ఏండ్ల యువ క్రికెట‌ర్‌. సామాద్‌ను ప్ర‌తిభ ఆధారంగా వివిఎస్ ల‌క్ష్మ‌న్‌నే స్వ‌యంగా ఎన్నుకున్నారంటే .. సామాద్ టాలెంట్ ఎంటో ప్ర‌త్యేకంగాచెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రం లేదు. రంజీ మ్యాచుల్లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై బెంగుళూర్‌పై చెల‌రేగాడు. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లోనూ విరుచుక‌ప‌డే స‌త్తా సామాద్‌కు ఉంది.

రుతురాజ్ గైక్వార్డ్‌( చెన్నై)..

రుతురాజ్ గైక్వార్డ్‌ చ‌క్క‌ని టెక్నీట్‌, దూకుడు ఉన్న మ‌హారాష్ట్ర బ్యాట్స్ మెన్‌. గ‌త రెండు సీజ‌న్ల‌లో క‌లిపి చూస్తే.. భార‌త దేశ‌వాలీ వ‌న్డేలో అంద‌రీ కంటే ఎక్కువ ప‌రుగులు చేశారు. ధోని మాటల్లో చెప్పాలంటే.. చురుకైన బ్యాట్‌మెన్‌. ఇత‌డు సాధార‌ణంగా ఒపెనింగ్‌, లేదా 3 వ‌స్థానంలో ఆడుతాడు. ఈ 23 ఏండ్ల బ్యాట్‌మెన్స్‌కు చ‌క్క‌ని అవకాశం . ప్ర‌స్తుతం క‌రోనా సోక‌డంతో ప్రారంభ మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. కోలుకున్న త‌రువాత వ‌చ్చిన క‌చ్చితంగా టాలెంట్‌ను చూపిస్తాడు.

దేవ‌ద‌త్ పాడిక‌ల్‌(బెంగుళూర్‌)

దేవ‌ద‌త్ పాడిక‌ల్‌..ఏడాది కాలంలో దేశవాలీ ఆట‌లో త‌న దూకుడైన ఆట తీరుతో ఎక్కువ మందిని ఆక‌ర్షించాడు. కేర‌ళ‌లో జ‌న్మించిన ఈయ‌న‌. ప్ర‌స్తుతం బెంగుళూర్‌కు ఆడుతున్న దేవ్‌ద‌త్‌. గ‌త దేశ‌వాలీ సీజ‌న్ లో..అనే ట్రోఫీలు గెలిచి.. టాప్ స్కోర‌ర్‌గా నిలిచారు. పాడిక‌ల్ ఆడిన ముస్తాక్ అలీఖాన్ టోర్నీలో ఏకంగా 175.5 స్ట్రైక్ రేట్‌తో 580 ప‌రుగులు సాధించ‌డం విశేషం.

ర‌వి విశ్నాయ్ (పంజాబ్)

ర‌వి విశ్నాయ్ .. అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్‌లో అత్యంత ప్ర‌భావితం చూపిన లెగ్ స్పిన‌ర్‌.. 6 మ్యాచ్‌లో 17 వికెట్ తీసిన‌.. అత‌డిని ఏ ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్ మెన్ స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొలేక పోయారు. రాజ‌స్థాన్ కు చెందిన ర‌వి ప్ర‌స్తుతం పంజాబ్ జ‌ట్టులో ఆడ‌నున్నాడు. టీం కోచ్ అనిల్ కుంబ్లే శిక్ష‌ణ‌లో మ‌రింత రాటుతేలిన‌ట్టుగా తెలుస్తుంది.

సర్ఫరాజ్‌ ఖాన్ (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)

సర్ఫరాజ్‌ ఖాన్‌ గతంలోనే ఐపీఎల్‌లో ఓ మెరుపు మెరిసే ప్రయత్నం చేశాడు. కొన్ని కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. కానీ స్వీయ తప్పిదాలు, జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలతో సర్ఫరాజ్ కెరీర్‌ వెనక్కి వెళ్లింది. 22 ఏళ్ల సర్ఫరాజ్‌, దేశీ క్రికెట్‌లో 301, 226, 78, 25, 177 పరుగుల ఇన్నింగ్స్‌లతో అత్యుత్తమ ఫామ్‌లోకి వచ్చాడు. సహజసిద్ధంగానే సర్ఫరాజ్‌ ఖాన్‌ దూకుడైన బ్యాట్స్‌మన్‌. టీ20 ఫార్మాట్‌లో సర్ఫరాజ్‌ ఆకాశమే హద్దుగా ఆడతాడు

Show Full Article
Print Article
Next Story
More Stories