అదరగొడుతున్న యువ క్రికెటర్ రితురాజ్.. వరుస సెంచరీలతో వీర బాదుడు.. ఎక్కడంటే..

Young Cricketer Ruturaj: యువ క్రికెటర్ రితురాజ్ ప్రదర్శనలు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి.

hmtv Digital Team
Updated on: 11 Dec 2021 9:30 PM IST
Young Cricketer Ruturaj Gaikwad Hat Trick Centuries in Vijay Hazare Trophy Created Sensation | Cricket News
X

అదరగొడుతున్న యువ క్రికెటర్ రితురాజ్.. వరుస సెంచరీలతో వీర బాదుడు.. ఎక్కడంటే..

Young Cricketer Ruturaj: యువ క్రికెటర్ రితురాజ్ ప్రదర్శనలు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నీలో మహారాష్ట్ర కెప్టెన్ రీతురాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మహారాష్ట్ర క్రికెట్ తేజం రితురాజ్ విజయ్ హజారే టోర్నీలో మొదటి మూడు మ్యాచ్‌ల్లో సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాడు.

కేరళపై మూడో సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న రితురాజ్ 129 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. తొలుత రితురాజ్ అద్భుత బ్యాటింగ్ చేయడంతో మహారాష్ట్ర 291 పరుగులు చేసింది. అంతకు ముందు విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై రీతురాజ్ 136 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో చండీగఢ్‌పై 154 పరుగులు చేశాడు.

ఈ హ్యాట్రిక్ సెంచరీతో, విజయ్ హజారే ట్రోఫీలో ఒక సీజన్‌లో అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా రితురాజ్ నిలిచాడు. మయాంక్ అగర్వాల్, ఆర్ సమర్థ్ తలా మూడు సెంచరీలు సాధించి రితురాజ్‌తో సమానంగా ఉన్నారు. పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ లు నాలుగు సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నారు.

ప్రస్తుతం రీతురాజ్ మూడు మ్యాచ్‌ల్లో 414 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 207. దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో జరగనున్న వన్డే సిరీస్‌లో రితురాజ్‌కు చోటు దక్కింది. 2021 ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రితురాజ్ ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. టోర్నీలో అతను 635 పరుగులు చేశాడు. సగటు 45.35. చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్లకు రీతురాజ్‌ను తన వద్ద ఉంచుకుంది.

hmtv Digital Team

hmtv Digital Team

Next Story