Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌లో మారని జైస్వాల్ తీరు.. 7 ఇన్నింగ్స్‌లలో ఒకే విధంగా ఔట్!

Yashasvi Jaiswals Weakness Exposed Out in the Same Way for 7th Time
x

Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌లో మారని జైస్వాల్ తీరు.. 7 ఇన్నింగ్స్‌లలో ఒకే విధంగా ఔట్!

Highlights

Yashasvi Jaiswal: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో రాణించలేదు.

Yashasvi Jaiswal: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న జైస్వాల్, ఇంగ్లండ్ పర్యటనలో కూడా అదే విధమైన ప్రదర్శన ఇస్తాడని అంతా ఆశించారు. సిరీస్ మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి ఆశలు రేకెత్తించినా, ఆ తర్వాత అతని ప్రదర్శనలో నిలకడ లోపించింది. ఇప్పుడు ఓవల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా జైస్వాల్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ సిరీస్‌లో ఆరోసారి 50 పరుగుల లోపే ఔటయ్యాడు. అయితే, ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఏడు ఇన్నింగ్స్‌లలో ఒకే విధంగా ఔట్ అయ్యాడు.

జూలై 31న భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఈసారి కూడా మంచి ఆరంభం లభించలేదు. నాలుగో ఓవర్‌లో గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో జైస్వాల్ ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ కేవలం 2 పరుగులకే ఔటవ్వడంతో, జట్టుకు మరోసారి పెద్ద భాగస్వామ్యం అందించడంలో విఫలమయ్యాడు.

ఈ సిరీస్‌లో జైస్వాల్ మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో కూడా అతని నుండి అదే విధమైన ప్రదర్శన ఆశించారు. కానీ, ఆ తర్వాత వరుసగా 8 ఇన్నింగ్స్‌లలో జైస్వాల్ కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌లకే ఔటయ్యాడు. ఇందులో రెండు సార్లు కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ సిరీస్‌లో అతని స్కోర్లు వరుసగా.. 101, 4, 87, 28, 13, 0, 58, 0, 2.

తక్కువ స్కోర్లు మాత్రమే కాకుండా, జైస్వాల్ ఔటైన విధానం కూడా ఈ సిరీస్‌లో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ సిరీస్‌లో ఆడిన 9 ఇన్నింగ్స్‌లలో జైస్వాల్ 7 ఇన్నింగ్స్‌లలో ఒకే తరహా బలహీనతకు బలైపోయాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేసినప్పుడు, జైస్వాల్ ఎక్కువగా ఎల్‌బీడబ్ల్యూ లేదా స్లిప్స్‌లో క్యాచ్‌ అవుట్ అవుతున్నాడు. దీని బట్టి జైస్వాల్ బలహీనతను ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా అర్థం చేసుకున్నారని స్పష్టమవుతోంది. ఈ లోపాన్ని సరిదిద్దుకోవడం జైస్వాల్‌కు రాబోయే రోజుల్లో పెద్ద సవాలు కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories