WTC Final: గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ స్టెప్పులు

WTC Final: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల్ని కాసేపు ఉత్సాహపరిచే ప్రయత్నం చేశాడు.

Arun Chilukuri
Updated on: 21 Jun 2021 3:10 PM IST
WTC Final: Virat Kohli Dances While Fielding During Match Against New Zealand
X

WTC Final: గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ స్టెప్పులు

WTC Final: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల్ని కాసేపు ఉత్సాహపరిచే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ సీరియస్ గా నడుస్తున్న టైంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ భాంగ్రా డ్యాన్స్ చేశాడు. గ్యాలరీలో ఫ్యాన్స్ రిథమిక్ గా డ్రమ్స్ వాయిస్తుంటే కెప్టెన్ కోహ్లి అలా డ్యాన్స్ మూడ్ లోకి వెళ్లిపోయాడు. వెంటనే అభిమానులు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. వాటిని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ట్రెండ్‌ అవుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియ‌న్ టీమ్‌ను 217 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన కివీస్‌ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 2 వికెట్ల‌కు 102 ప‌రుగులు చేసింది. మ్యాచ్‌లో నాలుగోరోజైన సోమవారం సౌథాంప్టన్‌ పరిసరాల్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story