WTC Final: డబ్యూటీసీ ఫైనల్ టికెట్‌ ధర.. తెలిస్తే షాకవ్వాల్సిందే?

WTC Final: భారత్, న్యూజిలాండ్ టీంల మాధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 27 May 2021 11:16 PM IST
WTC Final Ticket Rate Rs2 Lakhs
X

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ఫొటో ట్విట్టర్)

WTC Final: భారత్, న్యూజిలాండ్ టీంల మాధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. సౌతాప్టంన్ వేదికగా జూన్ 18 న ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశన్నంటున్నాయంట. ఒక్కో టిక్కెట్ ధర రూ. 2 లక్షల వరకు పలుకుతుందంట. అలాగే మ్యాచ్ ను చూసేందుకు కూడా అభిమానులు పోటీపడుతుండడంతో... అదే రేంజ్‌లో టికెట్ల ధరలు పేలుతున్నాయని తెలుస్తోంది.

మరోవైపు ఈ మ్యాచ్​కు కొద్దిమంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) ఇదివరకే ప్రకటించింది. దీంతో టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయని సమాచారం.

ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కు కేవలం 4 వేల మందిని మాత్రమే అనుమతించనున్నారంట. ఇందులో ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం టికెట్లు పోగా.. మిగిలిన 2000 టికెట్లను మాత్రమే అమ్మకానికి ఉంచనున్నట్లు హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలిపింది. దీంతో అభిమానులు టికెట్లకోసం ఎగబడుతున్నారంట. అందువల్లే టికెట్ల రేట్లు భారీగా పెరిగాయని టాక్.

కాగా, ఇంగ్లాండ్‌లో 2019 సెప్టెంబర్ తర్వాత ఫ్యాన్స్​ను అనుమతించడం ఇదే తొలిసారి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఫుల్ డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. టిక్కెట్లు బ్లాక్ మార్కెట్ లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయంట.

Venkata Chari

Venkata Chari

Next Story