Rajasthan: ఓటమిని తట్టుకోలేక యంగ్ రెజ్లర్ సూసైడ్!

Rajasthan: ప్రముఖ మహిళా రెజ్లర్లు గీతా ఫోగట్‌, బబితా ఫోగట్‌‌ల కజిన్ రితికా ఫోగట్‌ ఆత్మహత్య చేసుకుంది.

Arun Chilukuri
Published on: 18 March 2021 7:46 PM IST
Rajasthan: ఓటమిని తట్టుకోలేక యంగ్ రెజ్లర్ సూసైడ్!
X

Rajasthan: ఓటమిని తట్టుకోలేక యంగ్ రెజ్లర్ సూసైడ్!

Rajasthan: ప్రముఖ మహిళా రెజ్లర్లు గీతా ఫోగట్‌, బబితా ఫోగట్‌‌ల కజిన్ రితికా ఫోగట్‌ ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్‌లో జరిగిన రెజ్లింగ్‌ పోటీల ఫైనల్‌ మ్యాచ్‌లో ఒక్క పాయింట్‌ తేడాతో ఆమె ఓడిపోయింది. ఫైనల్‌లో ఎదురైన ఓటమితో తీవ్ర మనస్థాపానికి లోనై ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రస్థాయి జూనియర్ విమెన్, సబ్‌ జూనియర్ పోటీల్లో రితిక పాల్గొంది. ఈ పోటీల్లో పాల్గొన్నరితిక మంచి ప్రతిభ కనబరిచింది. ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 14న జరిగిన ఫైనల్‌లో ఒకే ఒక్క పాయింట్‌ తేడాతో ఓటమి పాలైంది. తీవ్ర నిరాశ చెంది జీవితాన్ని ముగించింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్నరితిక ఆత్మహత్య చేసుకోవడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story