WPL 2026: ఆర్సీబీ జోరు.. గుజరాత్ బేజారు.. ప్లేఆఫ్స్‌లోకి బెంగళూరు గ్రాండ్ ఎంట్రీ

WPL 2026:  ఆర్సీబీ జోరు.. గుజరాత్ బేజారు.. ప్లేఆఫ్స్‌లోకి బెంగళూరు గ్రాండ్ ఎంట్రీ
x

WPL 2026: ఆర్సీబీ జోరు.. గుజరాత్ బేజారు.. ప్లేఆఫ్స్‌లోకి బెంగళూరు గ్రాండ్ ఎంట్రీ

Highlights

WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది.

WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి, ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం 9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో 27 ఏళ్ల గౌతమి నాయక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. తన కెరీర్‌లో కేవలం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న గౌతమి, సీనియర్ ప్లేయర్‌లా బ్యాటింగ్ చేసి 55 బంతుల్లో 73 పరుగులు (7 ఫోర్లు, 1 సిక్స్) బాదింది. కెప్టెన్ స్మృతి మంధాన (26), రిచా ఘోష్ (27)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. చివర్లో రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ వేగంగా ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగుల భారీ స్కోరు సాధించింది.

179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్‌కు ఆరంభం నుంచే చుక్కలు కనిపించాయి. ఆర్సీబీ బౌలర్ సయాలీ సత్ఘరే తన పదునైన బంతులతో రెండో ఓవర్లోనే ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ పంపింది. లారెన్ బెల్ కూడా తోడవడంతో గుజరాత్ 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గుజరాత్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ (54) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, ఆమెకు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. చివరకు 20 ఓవర్లలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో ఆర్సీబీ ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. గత సీజన్ చివరి మ్యాచ్‌ను కూడా కలుపుకుంటే బెంగళూరుకు ఇది వరుసగా ఆరో విజయం. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ఆర్సీబీ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం 10 పాయింట్లతో టేబుల్ టాప్‌లో ఉన్న బెంగళూరు, మరో విజయం సాధిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. వడోదర మైదానంలో మొదట బ్యాటింగ్ చేసి గెలిచిన తొలి జట్టుగా కూడా స్మృతి సేన చరిత్ర సృష్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories