సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

Woodlands Hospital Stated Health Bulletin of Sourav Ganguly
x

సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

Highlights

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్‌ను విడుదల చేశారు.

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గంగూలీకి మోనోక్లోనల్ యాంటీ బాడీలతో చికిత్స చేస్తున్నామని కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ ఎండీ, సీఈవో డాక్టర్ రూపాలీ బసూ ప్రకటించారు.

ఇక సోమవారం గంగూలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయనను వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు డాక్టర్ దేవిశెట్టి, డాక్టర్ అఫ్తాబ్ ఖాన్‌ల సలహాలు తీసుకుంటూ డాక్టర్ సప్తర్షి బసూ, డాక్టర్ సౌతిక్ పాండాల వైద్యుల బృందం చికిత్స చేస్తోందని రూపాలీ బసూ చెప్పారు. మందులను సమయానికి డోసులువారీగా ఇస్తున్నట్టు తెలిపారు.
Show Full Article
Print Article
Next Story
More Stories