WPL 2023: నేటి నుంచి మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్..

Womens Premier League, Match 1, Gujarat Giants vs Mumbai Indians
x

WPL 2023: నేటి నుంచి మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్..

Highlights

Women's Premier League: మహిళల ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధమైంది.

Women's Premier League: మహిళల ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇవాళ డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరిగే తొలి లీగ్ మ్యాచ్‌తో ఉమెన్స్‌ క్రికెట్‌లో కొత్త చరిత్ర మొదలుకానుంది. ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ గెయింట్స్‌ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ముంబై, గుజరాత్, బెంగళూరు, యూపీ వారియర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు పాల్గొననున్నాయి.

ఓ ఎలిమినేటర్‌, ఫైనల్‌తో సహా లీగ్‌లో మొత్తం 22 మ్యాచులు జరగనున్నాయి. ప్రతీ టీమ్‌ ఇతర నాలుగు జట్లతో రెండేసి మ్యాచులు ఆడనుంది. టాప్‌గా నిలిచిన టీమ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లోని రెండు టీమ్‌ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఈ లీగ్‌లో తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories