Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కష్టాల్లో టీం ఇండియా.. ఏమైందంటే?

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కష్టాల్లో టీం ఇండియా.. ఏమైందంటే?
x

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కష్టాల్లో టీం ఇండియా.. ఏమైందంటే?

Highlights

Virat Kohli: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే (ఇండియా vs ఇంగ్లాండ్ వన్డే)లో విరాట్ కోహ్లీ ఆడకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Virat Kohli: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే (ఇండియా vs ఇంగ్లాండ్ వన్డే)లో విరాట్ కోహ్లీ ఆడకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లలో ఒకరు. కాబట్టి ఫిట్‌నెస్ కారణంగా అతన్ని ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించడం ఆయన ఫ్యాన్స్‌కు కొంచెం కష్టమైన వార్తనే చెప్పాలి. మోకాలి వాపు కారణంగా విరాట్ ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు అతని గాయంతో పాటు కటక్‌లో జరగనున్న రెండవ మ్యాచ్‌లో అతను ఆడటం గురించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది.

మ్యాచ్‌కు ముందు రోజు సాయంత్రం ప్రాక్టీస్ సమయంలో విరాట్ పూర్తిగా ఫిట్‌గా కనిపించాడని శుభ్‌మాన్ గిల్ అప్‌డేట్ ఇచ్చాడు. నాగ్‌పూర్‌లో తొలి వన్డే ఆడటానికి ముందు అతను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కానీ విరాట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండడని టాస్ సమయంలో రోహిత్ శర్మ చెప్పినప్పుడు అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అంతకుముందు యశస్వి జైస్వాల్‌కు కోహ్లీ స్థానంలో అవకాశం ఇచ్చినట్లు అనిపించింది. కానీ మ్యాచ్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ తన స్థానంలో కోహ్లీని తీసుకున్నట్లు చెప్పాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. "ప్రాక్టీస్ సమయంలో విరాట్ మోకాలికి ఎటువంటి సమస్య లేదు. కానీ మేము హోటల్‌కు చేరుకున్నప్పుడు మోకాలి గాయం వాచింది. ఇది అంత తీవ్రమైన సమస్య కాదు, కటక్‌లో జరగనున్న రెండవ వన్డే మ్యాచ్‌లో అతను ఖచ్చితంగా ఆడతాడు" అని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి అయితే విరాట్ మోకాలికి ఎటువంటి స్కానింగ్ జరుగలేదు. విరాట్ టెస్ట్ కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తాడా లేదా కటక్‌లో జరిగే రెండో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories