ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ పైన ఆ మూడు స్టార్స్ ఎందుకో తెలుసా?

ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ పైన ఆ మూడు స్టార్స్ ఎందుకో తెలుసా?
x
Highlights

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ లో భారత జట్టు కొత్త జెర్సీని ధరించి బరిలోకి దిగింది. అయితే ఈ జెర్సీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చ నడుస్తోంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ లో భారత జట్టు కొత్త జెర్సీని ధరించి బరిలోకి దిగింది. అయితే ఈ జెర్సీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చ నడుస్తోంది. అదేంటంటే జెర్సీ లో బీసీసీఐ లోగో పైన మూడు నక్షత్రాలు ఎందుకు పెట్టారన్న చర్చ నడుస్తోంది. దీని వెనుక గల కారణం ఏంటంటే భారత్ ఇప్పటివరకు మూడు ప్రపంచ కప్ లను సాధించినందుకు చిహ్నంగా ఆ మూడు నక్షత్రాలను ముద్రించారట. ఈ విషయాన్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. అలాంటి జట్టులో తానూ కూడా భాగం కావడం సంతోషమని అన్నాడు. అటు భారత్ 2007 లో టీ20 వరల్డ్ కప్, 1983, 2011లో ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో రెండు మాజీ ఆటగాడు ధోని సారధ్యంలోనివే కావడం విశేషం. అటు భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ 3 వన్డేలు, 3 టీ20 లు మరియు 4 టెస్టులను ఆడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories