Who Is Dhanashree Verma : చాహల్‌కు కాబోయే సతీమణి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Who Is Dhanashree Verma : టీమ్‌ ఇండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే.. ధనశ్రీ వర్మతో

Krishna
Published on: 10 Aug 2020 12:07 PM IST
Who Is Dhanashree Verma : చాహల్‌కు కాబోయే సతీమణి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
X
Dhanashree Verma, Yuzvendra Chahal

Who Is Dhanashree Verma : టీమ్‌ ఇండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే.. ధనశ్రీ వర్మతో నిశ్చితార్థం అయినట్టుగా గత శనివారం ప్రకటించాడు చాహల్.. అయితే యుజ్వేంద్ర చాహల్ కాబోయే సతీమణి ధనశ్రీ వర్మ ఎవరు అనే సందేహం అందరిలో మొదలైంది. ఆమె గురించి సర్చ్ కూడా మొదలుపెట్టేశారు. ధనశ్రీ వృత్తిపరంగా ఓ వైద్యురాలు.. అయినప్పటికీ ఆమెకి సెలబ్రేటి తరహలో పెద్ద అభిమానులు ఉన్నారు. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఆమె యూట్యూబ్‌ స్టార్‌గానే ఎక్కువ మందికి పరిచయం.. ఆమెకి కొరియోగ్రఫీ చేసిన వీడియోలకి లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఇక యూట్యూబ్‌లో 1.51 మిలియన్ సబ్‌స్కైబర్లు కూడా ఉన్నారు. దీనిబట్టి చూస్తే ధనశ్రీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ఎప్పటికప్పుడూ టచ్ లో ఉంటుందని అర్ధం అవుతుంది. ఇక యుజ్వేంద్ర చాహల్‌తో వివాహం ఫిక్స్ అయినట్టుగా ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టుకు ఏకంగా 2 లక్షకు పైగా లైకులు వచ్చాయంటే ఆమెకి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో తెలుసుకోవచ్చు. నటుడు కార్తీక్‌ ఆర్యన్‌, సింగర్‌ గురు రంద్వాతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి.

ఇక అటు యుజ్వేంద్ర చాహల్ భారత జట్టులో లెగ్ బ్రేక్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. హర్యానా రాష్ట్రం నుంచి వచ్చిన చాహల్ వన్డే, టీ 20లలో సత్తా చాటుతున్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ తరుపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఇక చాహల్ కి ధనశ్రీ వర్మతో నిశ్చితార్థం కావడంతో అయన అభిమానులు , భారత క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Krishna

Krishna

Next Story