T20 World Cup: ఉత్కంఠపోరులో వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ

T20 World Cup: చివరి బంతికి ఫోర్ కొట్టలేకపోయిన బంగ్లాదేశ్ కెప్టెన్

Sandeep Eggoju
Published on: 29 Oct 2021 8:49 PM IST
West Indies Won on Bangladesh in T20 World Cup
X
బాంగ్లాదేశ్ పై ఘానవిజయం సాధించిన వెస్టిండీస్ (ఫైల్ ఇమేజ్)

T20 World Cup: టీ20 వాల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరు జరిగింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతికి ఫోర్ కొడితే గెలుస్తారనగా, బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా చేతులెత్తేశాడు. దీంతో వెస్టిండీస్ అనూహ్యరీతిలో విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేయగా లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ 44 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మదుల్లా 31 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. విండీస్ బౌలర్లలో రాంపాల్, హోల్డర్, రస్సెల్, హోసీన్, బ్రావో తలో వికెట్ తీశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story