We Said Yes: ఓ ఇంటివాడు కాబోతున్న చాహల్‌

Arun Chilukuri
Published on: 8 Aug 2020 6:00 PM IST
We Said Yes: ఓ ఇంటివాడు కాబోతున్న చాహల్‌
X

We Said Yes: టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. పెళ్లికి ముందు జరిగే రోకా వేడుక పూర్తయిందని చాహల్ వెల్లడించాడు. "మా కుటుంబాలతో కలిసి మేం యస్ అనేశాం" అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా చహల్ తన కాబోయే భార్యతో కలిసివున్న ఫొటోను కూడా పంచుకున్నాడు. చాహల్ కాబోయే భార్య డాక్టర్ అని తెలుస్తోంది. ఆమె కొరియోగ్రాఫర్ కూడా. కాగా గత కొన్ని రోజులుగా ధనుశ్రీతో ప్రేమలో ఉన్న చాహల్‌.. గతంలో ఆమె వీడియోలను‌ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరోనా ప్రభావం కారణంగా ఇన్నాళ్లూ విశ్రాంతి తీసుకున్న చాహల్ త్వరలోనే ఐపీఎల్ ఆడేందుకు యూఏఈ వెళ్లాల్సి ఉంది. యూఏఈ వేదికగా ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో, పెళ్లి ముహూర్తం ఎప్పుడన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story