Ahmedabad: స్టేడియంలో కోహ్లీ చిలిపిచేష్టలు చూశారా?

Ahmadabad :మరోసారి స్టేడియంలో తన చిలిపి చేష్టలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

Kranthi
Updated on: 25 Feb 2021 11:19 AM IST
Watch Virat Kohli Imitates Steve Smith Hilarious Video
X

ఫైల్ ఫోటో


Ahmedabad: మైదానంలో ఎల్లప్పుడూ చురుకుగా ఉండే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది క్రికెట్ అభిమానులకు నచ్చుతుంది. ఒకప్పుడు కోపంలో ప్రత్యర్థిలపై విరుచుకుపడినా.. కుర్రోడిలో ఫైర్ ఉంది అనేవాళ్లు. కెరీర్​ ఆరంభంలో పార్ట్​టైమ్​ బౌలింగ్​ చేసినా... ప్రస్తుతం అతడి బ్యాటింగ్​ మీద మాత్రమే దృష్టి సారించాడు. తన బ్యాటింగ్ తో సమాధానం చెబుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. పైగా ఫిట్నెస్ విషయంలో కోహ్లీని బీట్ చేసేవాళ్లే లేరు అని అనేకమంది నిపుణులు తెలిపారు. వీటన్నింటితో పాటు కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. అదే చిలిపి కోణం.

మరోసారి తన చిలిపి చేష్టలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మూడో టెస్టుకు ముందు ప్రాక్టీస్​ సెషన్​ సందర్భంగా విరాట్​.. దక్షిణాఫ్రికా క్రికెట్​ దిగ్గజం, ఆల్​రౌండర్​ జాక్వస్​ కలిస్​లా బౌలింగ్​ చేశాడు. ఆసీస్ స్టార్​ బ్యాట్స్​మెన్ స్టీవ్​ స్మిత్​ బ్యాటింగ్​ను అనుకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలైంది.

దాదాపు కలిస్​ బౌలింగ్​ శైలికి చాలా దగ్గరగా వచ్చాడు భారత కెప్టెన్. బ్యాటింగ్​ చేసిన అనంతరం స్మిత్ ఎలా ప్రవర్తిస్తాడో.. విరాట్​ చేసి చూపించాడు.


Kranthi

Kranthi

Next Story