Pink Ball Test: పిచ్ అలానే ఉంటే..టూర్ ముగిసినట్టే - జాఫర్ ఫన్నీ కామెంట్స్

Venkata Chari
Updated on: 3 March 2021 4:50 PM IST
Wasim Jaffer Trolls on England Cricketers Hilarious Conversation
X

ఇంగ్లాండ్ టీం (ఫోటో ట్విట్టర్)

India vs England: మొతేరా వేదికగా రేపటి నుంచి ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 4వ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిచ్ పై మరోసారి చర్చ కొనసాగుతోంది. మూడో టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోవడంతో..రేపటి మ్యాచ్‌కు పిచ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను ట్రోల్‌ చేస్తూ ఒక ఫన్నీ ఫోటోను ట్విట్లర్ లో షేర్ చేశాడు. ఆ ఫోటోలో రూట్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, మార్క్‌ వుడ్‌, జానీ బెయిర్‌ స్టోలతో పాటు ఇంగ్లండ్‌ అసిస్టెంట్‌ కోచ్‌ పాల్‌ కొలింగ్‌వుడ్‌ ఉన్నారు. వీరంతా పిచ్‌ను చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది. అయితే వారి మధ్య జరిగిన సంభాషణకు జాఫర్ తనదైన శైలిలో పంచ్ లు కలిపి రాశాడు.

బ్రాడ్‌: పిచ్‌ అలాగే ఉంటే నా టూర్‌ ముగిసినట్టే.

మార్క్‌ వుడ్‌: నవ్వు కనీసం మ్యాచ్‌ అయినా ఆడావు బ్రో.

బెయిర్‌ స్టో: ఇక్కడ నాకు ఫ్లాట్‌ పిచ్‌ మాత్రం కనబడట్లేదు.

కోలింగ్‌వుడ్‌: ఈసారి కూడా పిచ్‌ స్పిన్‌కే అనుకూలించనుందా?

జో రూట్‌: హో! మరోసారి ఇక్కడే ఆడాల్సి వస్తుంది. ఇలా జాఫర్ ఇంగ్లాండ్ టీం సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి ఫన్నీగా రాశాడు. జాఫర్‌ షేర్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


Venkata Chari

Venkata Chari

Next Story