Washington Sundar: నా కొడుక్కి అవకాశాలు ఇవ్వట్లేదు.. వాషింగ్టన్ సుందర్ తండ్రి ఆవేదన

Washington Sundar
x

Washington Sundar: నా కొడుక్కి అవకాశాలు ఇవ్వట్లేదు.. వాషింగ్టన్ సుందర్ తండ్రి ఆవేదన

Highlights

Washington Sundar: ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కొందరు బాగా రాణించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. అలాగే, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కూడా నిలకడగా ఆకట్టుకున్నారు.

Washington Sundar: ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కొందరు బాగా రాణించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. అలాగే, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కూడా నిలకడగా ఆకట్టుకున్నారు. మాంచెస్టర్ టెస్ట్‌లో ఒక గొప్ప సెంచరీతో వాషింగ్టన్ సుందర్, మ్యాచ్‌ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, సుందర్ తండ్రి మాత్రం ఒక విషయంలో సంతోషంగా లేరు. టీమ్ ఇండియాలో మార్పులు చేయాలని ఆయన కోరుతున్నారు. 25 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ మాంచెస్టర్ టెస్ట్ చివరి రోజు టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో అదిరిపోయే సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజాతో కలిసి 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, టీమ్ ఇండియా ఓడిపోకుండా కాపాడాడు. చివరి షాట్‌తోనే తన మొదటి టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో సుందర్‌కు టీమ్ ఇండియాలో చోటు దాదాపు ఖాయమైనట్లే అనిపిస్తుంది.

అయితే, వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం. సుందర్ కొన్ని విషయాలపై అసంతృప్తితో ఉన్నారు. వాషింగ్టన్ 2021లో గాబా టెస్ట్‌లో టీమ్ ఇండియా తరఫున ఆడటం మొదలుపెట్టి, ఆ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత, వివిధ కారణాల వల్ల అతడికి జట్టులో నిలకడగా అవకాశం రాలేదు. ఈ విషయమై ఎం. సుందర్ చాలా కోపంగా ఉన్నారు. వాషింగ్టన్ సెంచరీ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..వాషింగ్టన్ ఎప్పుడూ బాగానే ఆడుతున్నాడు. కానీ ప్రజలు అతడిని మర్చిపోతున్నారు. మిగతా ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి, కానీ నా కొడుక్కి మాత్రం రావడం లేదని అన్నారు.

ఎం. సుందర్ టీమ్ ఇండియాకు ఒక డిమాండ్ కూడా చేశారు. వాషింగ్టన్‌కు వరుసగా 5వ నంబర్‌లో బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అతడిని 5వ నంబర్‌కు ప్రమోట్ చేయగానే సెంచరీ కొట్టాడు. సుందర్ తండ్రి మాట్లాడుతూ.. వాషింగ్టన్‌కు రెండో ఇన్నింగ్స్‌లో చేసినట్లుగానే వరుసగా ఐదవ నంబర్‌లో బ్యాటింగ్ ఇవ్వాలి. కనీసం 5-10 అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వాషింగ్టన్‌కు మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అవకాశం దక్కకపోవడంపైనా ఆయన తండ్రి చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సెలెక్టర్లు తమ కొడుకు ప్రదర్శనపై దృష్టి పెట్టాలని సూచించారు. సుందర్‌కు రెండో టెస్ట్ నుంచి టీమ్‌లో అవకాశం దక్కింది. ఆ తర్వాత నుంచి అతడు బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణిస్తున్నాడు. సుందర్ నాలుగో టెస్ట్ వరకు 6 ఇన్నింగ్స్‌లలో 205 పరుగులు, 5 ఇన్నింగ్స్‌లలో 7 వికెట్లు తీసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories