Ind vs SL: లంకకు భారీ షాక్​.. కరోనా బారిన కీలక ఆటగాడు..

Wanindu Hasaranga Tests Positive for Covid-19 Again
x

Ind vs SL: లంకకు భారీ షాక్​.. కరోనా బారిన కీలక ఆటగాడు..

Highlights

Ind vs SL: భారత్‌తో టీ20 సిరీస్ జరగనున్న వేళ శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది.

Ind vs SL: భారత్‌తో టీ20 సిరీస్ జరగనున్న వేళ శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ వనిందు హసరంగ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో అతడు ఐసోలేషన్‌కే పరిమితం అయ్యాడు. ఇదివరకే కోవిడ్ బారనపడి ఐసోలేషన్‌లో ఉన్న హసరంగ ఫిబ్రవరి 22న చేసిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలాడు.

కాగా ఈ సిరీస్‌కు ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. గాయాల కారణంగా పేసర్ దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ తప్పుకున్నారు. లంకతో స్వదేశంలో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా. ఫిబ్రవరి 24, 26, 27న టీ*20లు, మార్చి 4 నుంచి 8 వరకు తొలి టెస్టు, మార్చి 12 నుంచి 16 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories