Dada Birthday: "ఆర్ఆర్ఆర్" పోస్టర్ లో సెహ్వాగ్, గంగూలీ

Dada Birthday: భారత క్రికెట్ జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన విభిన్నమైన

Sandeep Reddy
Published on: 8 July 2021 3:18 PM IST
Virendra Sehwag Birthday wishes to Sourav Ganguly By Sharing RRR Movie Poster | Cricket News Today
X

సెహ్వాగ్, గంగూలీ పోస్టర్ 

Dada Birthday: భారత క్రికెట్ జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన విభిన్నమైన పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటాడు. భారత క్రికెట్ మాజీ సారధి సౌరభ్ గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా సెహ్వాగ్ పేరున ఒక అభిమాని చేసిన ఒక పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆ చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఆ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో సెహ్వాగ్ ని, రామ్ చరణ్ స్థానంలో గంగూలీని మార్ఫింగ్ చేసి గంగూలీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు సెహ్వాగ్. కొన్నిరోజుల క్రితమే ఈ పోస్టర్ లో ఉన్న చరణ్, ఎన్టీఆర్ లకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ని జోడించి ట్విట్టర్ లో విడుదల చేసింది మరువక ముందే మరోసారి సెహ్వాగ్ ఆ పోస్టర్ ని దాదా పుట్టినరోజున వాడటంతో "ఆర్ఆర్ఆర్" చిత్రానికి దేశవ్యాప్తంగా బాగానే పబ్లిసిటీ జరుగుతుంది.

నేటితో 49వ వసంతంలోకి అడుగుపెట్టిన దాదా 1992 జనవరి 11న వెస్ట్ ఇండీస్ తో జరిగిన వన్డేతో భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన గంగూలీ తన కెరీర్ లో బ్యాటింగ్ తో పాటు లెజెండరీ కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. తన కెరీర్ లో 311 వన్డే మ్యాచ్ లలో 11,363 పరుగులు, 113 టెస్ట్ మ్యాచ్ లలో 7,212 పరుగులతో 40కి పైగా యావరేజ్ తో భారత జట్టుకు పలు విజయాలను అందించాడు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యకుడి పదవిలో ఉన్న గంగూలీని దాదా, బెంగాల్ టైగర్, ప్రిన్స్ అఫ్ కలకత్తా అనే ముద్దు పేర్లతో అభిమానులు పిలుచుకుంటారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story