విరుష‌్క బిడ్డ ఫోటోపై క్లారిటీ.. ఆ ఫోటో ఎవరిదంటే?

విరుష‌్క బిడ్డ ఫోటోపై క్లారిటీ.. ఆ ఫోటో ఎవరిదంటే?
x

విరుష్క పైల్ ఫోటో

Highlights

తరాత్రి విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్‌ కోహ్లీ చిన్నారి పాప ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

విరుష్క జంటకు ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోమవారం ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల కూతురు తొలి ఫొటో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతరాత్రి విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్‌ కోహ్లీ చిన్నారి పాప ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తెల్లటి వస్త్రంలో పాపాను చుట్టి ఉండగా.. కాళ్లు కనపడే ఫొటో ఉంది. ఆ ఫొటోకు వికాస్‌ కోహ్లీ 'స్వాగతం' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, తమ ఇంట్లోకి లిటిల్‌ ఏంజిల్‌ వచ్చిందని వికాస్ కోహ్లీ తెలిపాడు.

వికాస్ కోహ్లీ పోస్టు చేసిన ఫోటో నెట్టింట్టో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో చిన్న పాప విరాట్ కోహ్లీ కూతురేనని అందరూ అభిప్రాయపడ్డారు. ఆ ఫోటో్కు పెద్ద ఎత్తున లైకులు, షేర్లు కొట్టారు. అయితే వికాస్ కోహ్లీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటో కోహ్లీ కూతురుది కాదని, ఏదో విషెస్ చెప్పడానికి ఉపయోగించినట్లు విరాట్ సోదరుడు వికాస్‌ వెల్లడించాడు. ర్యాండమ్‌గా ఈ ఫోటోను వాడానని వికాస్ తెలిపాడు. దీంతో ఫాన్స్ నిరాశకు గురయ్యారు.

కాగా..సోమవారం కోహ్లీ తనకు కూతురు పుట్టిన విషయాన్ని ట్వీట్ చేశాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కొద్దినిమిషాల క్రితం ట్విట్టర్లో కొహ్లీ ట్వీట్ చేశాడు. కోహ్లీకీ అభిమానులతో పాటు, సెలబ్రీటిలు కూడా కాంగ్రాట్స్ చెబుతున్నారు. ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ నుంచి పేరెంటల్ లీవ్ తీసుకుని భార్య డెలివరీ కోసం కొహ్లీ స్వదేశం చేరుకున్నాడు. తమకు పుట్టే బేబీ కోసం ఈ జంట ఎప్పటినుంచో కలలు కంటోంది. ఎట్టకేలకు పాప పుట్టడం తమకెంతో ఆనందంగా ఉందని విరాట్ ఆ ట్వీట్ లో తెలిపాడు. ఇన్నాళ్లు ఇద్దరమున్న తాము ఇప్పుడు ముగ్గురమయ్యామని కొత్త జీవితం ఎంతో ఆనందంగా ఉండబోతోందనీ కొహ్లీ ట్వీట్ చేశాడు. తమ ప్రైవసీని కాపాడాలంటూ అభిమానులకు విన్నపం కూడా చేశాడు.




Show Full Article
Print Article
Next Story
More Stories