Virat Kohli: ఐసీసీ అవార్డులు.. చరిత్రలో తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు

Virat Kohli: పది ఐసీసీ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత

Shekhar G
Published on: 25 Jan 2024 7:40 PM IST
Virat Kohli wins ICC Mens ODI Cricketer of the Year award for 2023
X

Virat Kohli: ఐసీసీ అవార్డులు.. చరిత్రలో తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు

Virat Kohli: 2023 సంవత్సరానికిగాను ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. విరాట్ 2012, 2017, 2018లోనూ ఈ అవార్డును అందుకున్నాడు. నాలుగుసార్లు వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు అందుకున్న ఆటగాడిగా కింగ్ రికార్డు సృష్టించాడు. ఈ అవార్డుతో కలిపి కోహ్లీ ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి చేరింది. ఈ క్రమంలోనే పది ఐసీసీ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు.

ఈ జాబితాలో మరే ఆటగాడు కనీసం ఐదు అవార్డులు అందుకోలేదు. కుమార సంగక్కర 4 అవార్డులు , ఎంఎస్‌ ధోనీ 4 అవార్డులు అందుకున్నారు. గతేడాది కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 24 ఇన్నింగ్స్‌ల్లో 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో 765 పరుగులు చేసి టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు బాదాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో శతకం బాది వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Shekhar G

Shekhar G

Next Story