Virat Kohli vs Abhishek Sharma: కోహ్లీ vs అభిషేక్ గణాంకాలు.. ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?

Virat Kohli vs Abhishek Sharma
x

Virat Kohli vs Abhishek Sharma: కోహ్లీ vs అభిషేక్ గణాంకాలు.. ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?

Highlights

Virat Kohli vs Abhishek Sharma: భారత క్రికెట్‌లో తరతరాలుగా ప్రతిభావంతులు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, మహమ్మద్ హాజరుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ.. ఇలా దిగ్గజాలు ఉన్నారు.

Virat Kohli vs Abhishek Sharma: భారత క్రికెట్‌లో తరతరాలుగా ప్రతిభావంతులు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, మహమ్మద్ హాజరుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ.. ఇలా దిగ్గజాలు ఉన్నారు. అయితే ఆధునిక క్రికెట్‌కు నిర్వచనం చెప్పిన విరాట్ ఓ వైపు ఉంటే.. దూకుడే మంత్రంగా ఆడుతున్న అభిషేక్ శర్మ మరోవైపు ఉన్నాడు. దిగ్గజం కోహ్లీతో యువకుడు అభిషేక్ కెరీర్‌ను పోల్చడం సరికాదు. తొలి 30+ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల గణాంకాలను చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.

విరాట్ కోహ్లీ స్థిరత్వానికి నిలువెత్తు ఉదాహరణ:

విరాట్ కోహ్లీ తన తొలి 30కి పైగా టీ20 మ్యాచ్‌లలో 1368 పరుగులు చేశాడు. సగటు 50.22 ఉండటం కింగ్ స్థిరత్వానికి నిదర్శనం. టీ20ల్లో శతకాలు లేకపోయినా.. 13 అర్ధ శతకాలు నమోదు చేసి జట్టుకు నమ్మకమైన రన్‌మిషన్‌లా నిలిచాడు. ఒత్తిడిలోనూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే సామర్థ్యం కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది. కోహ్లీ భారత్ తరఫున 125 మ్యాచ్‌లు ఆడి 4188 రన్స్ చేశాడు. అతడి బెస్ట్ స్కోర్ 122 నాటౌట్. మొత్తంగా ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం విరాట్ టీ20ల నుంచి తప్పుకున్నాడు. ఆపై టెస్టులకు సైతం వీడ్కోలు చెప్పాడు. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.

అభిషేక్ శర్మ దూకుడు మారుపేరు:

అభిషేక్ శర్మ తొలి 30కి పైగా టీ20 మ్యాచ్‌లలో 1267 పరుగులు సాధించారు. సగటు 38.39గా ఉండగా ఉంది. అభిషేక్ ఖాతాలో ఇప్పటికే 2 శతకాలు, 8 అర్ధ శతకాలు ఉన్నాయి.ఈ స్టాట్స్ అభిషేక్ దూకుడు శైలికి అద్దం పడుతున్నాయి. పవర్‌ప్లేలోనే మ్యాచ్ దిశను మార్చే సామర్థ్యం అభిషేక్ కు ఉండడం పెద్ద ప్లస్. ఇప్పటివరకు అతడు 37 టీ20లు ఆడాడు.

విరాట్ కోహ్లీ ఆటలో నిలకడ, ఇన్నింగ్స్ బిల్డింగ్ ముఖ్యమైతే.. అభిషేక్ శర్మ ఆటలో ఆరంభం నుంచే దాడి ప్రధానంగా కనిపిస్తుంది. కోహ్లీ తన స్థిరత్వంతో జట్టును ఎన్నో మ్యాచ్‌లు గెలిపించగా, అభిషేక్ తన దూకుడుతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతూ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ పోలికలో ఎవరు గొప్ప అన్నది కాదు.. తరాలు మారినా ప్రతిభ మారలేదు. కోహ్లీ లెజెండ్‌గా నిలిచితే.. అభిషేక్ శర్మ భారత టీ20 భవిష్యత్తుకు ఆశాజ్యోతిగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో అభిషేక్ ఈ గణాంకాలను ఎంత దూరం తీసుకెళ్తాడో చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories