Sports: ద్ర‌విడ్‌ను ఇలా చూశారా.. కోహ్లీ ఫన్నీ వీడియో వైరల్

dravid
x

ద్రావిడ్ ట్విట్టర్ ఇమేజ్ 

Highlights

Sports: భారత జట్టు దిగ్గజ క్రికెటర్ మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్ర‌విడ్ ఎంత కూల్ గా కనిపిస్తాడో అందరికి తెలిసిందే.

Sports: భారత జట్టు దిగ్గజ క్రికెటర్ మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్ర‌విడ్ ఎంత కూల్ గా కనిపిస్తాడో అందరికి తెలిసిందే. ప్రత్యర్థులు నిప్పులు చెరిగే బంతులు విసురుతున్న ఒక అడ్డుగోడలా నిలబడి వారి ఓపికకు పరీక్ష పెడతాడు. వికెట్ కాపాడుకుంటూ ఎన్నో మ్యాచులను గెలిపించిన చరిత్ర ఒక వాల్ కే ఉంది. అయితే కూల్ ఉండే ద్రవిడ్ ఎప్పుడైనా ఆగ్రహం వ్యక్తం చేయడం చూశారా? కోపంతో ఊగిపోవడం క్రికెట్ అభిమాని ఎప్పుడు చూడలేదు.

రాహుల్ ఆగ్రహంతో ఊగిపోతున్న వీడియోను టీమిండియా కెప్టెన్ కోహ్లీ షేర్ చేశాడు. తాను ఎప్పుడు ఇంత కోపంతో ఉండే ద్రవిడ్ ను చూడలేదంటూ ట్వీట్ చేశాడు. ఇందిరాన‌గ‌ర్ కా గూండా హు మై అంటూ ఓ యాడ్ కోసం ద్ర‌విడ్ చేసిన ఈ వీడియోను విరాట్ ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. రాహుల్ భాయ్‌ను ఇంత‌కు ముందెప్పుడూ ఇలా చూడ‌లేద‌ని కామెంట్ చేశాడు. ఈ వీడియో మీరు కూడా చూడండి.



Show Full Article
Print Article
Next Story
More Stories