Virat Kohli: నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు బెంగుళూరు జట్టులోనే ఆడుతా

* ఆర్సీబీకి కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాదే ఆర్సీబీకి కెప్టెన్ గా తన చివరి ఐపీఎల్ అని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Sandeep Reddy
Updated on: 11 Oct 2021 7:00 PM IST
Virat Kohli Says I Will Play Till My Last IPL Match in Bangalore Team Only
X

Virat Kohli: నా చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు బెంగుళూరు జట్టులోనే ఆడుతా(ఫోటో:ఐపీఎల్)

Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాదే ఆర్సీబీకి కెప్టెన్ గా తన చివరి ఐపీఎల్ అని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సోమవారం ప్లేఆఫ్ మ్యాచ్ లో భాగంగా మ్యాచ్ కి ముందు ప్రెస్ మీట్ లో పాల్గొన్న విరాట్ కోహ్లి తాను కెప్టెన్సీ నుండి తప్పుకోవడానికి గల కారణాలను వివరించాడు. కెప్టెన్ గా పనిభారం ఎక్కువగా ఉన్నందు వల్లనే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

బెంగుళూరు టీం మేనేజ్మెంట్ ని ఒప్పించిన తరువాతే ఈ నిర్ణయాన్ని ప్రకటించానని, తాను బాధ్యతల విషయంలో నిజాయితీగా ఉంటానని అందుకే కెప్టెన్ గా అదనపు భారం ఉండటం వలన ఆటపై పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టలేకపోతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే తాను ఐపీఎల్ లో బెంగుళూరు జట్టు తరపునే తన చివరి మ్యాచ్ వరకు ఆడుతానని తెలిపాడు.

2013 నుండి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లి ఐపీఎల్ టైటిల్ ని ఒక్కసారి కూడా గెలువలేకపోయాడు. ఎలాగైనా ఈ ఏడాది టైటిల్ ని గెలిచి ఘనంగా కెప్టెన్ గా బాధ్యతల నుండి తప్పుకోవాలనే పట్టుదలతో విరాట్ కోహ్లి ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఈ సీజన్ లో విరాట్ కోహ్లి కెప్టెన్సీ చూస్తే ముచ్చటేస్తుందని, బహుశా కెప్టెన్ గా తన చివరి ఐపీఎల్ సీజన్ కాబట్టి అలా కసితో ఆడుతున్నాడేమోనంటూ కామెంట్ చేశాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story