Virat Kohli: ధోని పర్యవేక్షణలో నెట్స్ లో చెమటోడ్చిన విరాట్ కోహ్లి

* నేడు భారత్ - పాకిస్తాన్ మధ్య రసవత్తర పోరుకు దుబాయ్ వేదికగా సర్వం సిద్దం సిద్దమైంది.

Sandeep Reddy
Updated on: 24 Oct 2021 12:59 PM IST
Virat Kohli Net Practices Under the Guidance of Team India Mentor MS Dhoni
X

Virat Kohli: ధోని పర్యవేక్షణలో నెట్స్ లో చెమటోడ్చిన విరాట్ కోహ్లి

Virat Kohli: నేడు భారత్ - పాకిస్తాన్ మధ్య రసవత్తర పోరుకు దుబాయ్ వేదికగా సర్వం సిద్దం సిద్దమైంది. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు భారత్ - పాక్ మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక శనివారం రాత్రి చాలాసేపటి వరకు భారత జట్టు నెట్స్ లో ప్రాక్టీసు చేస్తూ కనిపించింది. అక్కడితో ఆగకాకుండా బిసిసిఐ ఏర్పాటు చేసిన ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా పాల్గొన్నారు.

ఇప్పటివరకు టీమిండియా.. పాకిస్తాన్‌తో ఓడిపోని చరిత్రను ఈరోజు జరగనున్న మ్యాచ్ ని చేజార్చుకోకుండా అదే ఘన చరిత్రని తన కెప్టెన్సీలో కూడా రిపీట్ చేయాలని విరాట్ కోహ్లి పట్టుదలతో ఉన్నాడు. విరాట్ కోహ్లి క్రీజ్‌లో చాలాసేపు బ్యాటింగ్ చేస్తూ కనిపించాడతను. క్యాచ్, ఫీల్డింగ్ చేస్తూ చెమటోడ్చాడు. మెంటార్‌గా బాధ్యతల్లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పర్యవేక్షణలో అతని ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్ సాగింది. మధ్యమధ్యలో జట్టు ఆటగాళ్ళతో ముచ్చటిస్తూ, వారికి సలహాలు సూచనలు ఇస్తూ కనిపించాడు ధోని.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story