Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్ లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

Virat Kohli: క్రికెట్ మైదానంలో రికార్డుల మోత మోగించే విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలోనూ తనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు.

Kranthi
Updated on: 2 March 2021 1:27 PM IST
Virat Kohli is the First Cricketer to Hit 100 Million Followers on Instagram
X

ఫైల్ ఇమేజ్ 

Virat Kohli: క్రికెట్ మైదానంలో రికార్డుల మోత మోగించే విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. తాజాగా అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 100 మిలియన్‌కి చేరింది. భారత్‌ తరఫున ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సెలెబ్రిటీ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.అలాగే భారత్‌లో విశేషమైన అభిమాన గణం ఉన్న టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని ప్రస్తుతం 3.4 కోట్ల మంది అనుసరిస్తున్నారు. దీంతో మాజీ సారథి కన్నా కోహ్లీని అనుసరిస్తున్న వారి సంఖ్య మూడింతలు ఎక్కువగా ఉంది. ఇక విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడుతున్నసంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రెండు అర్ధశతకాలు సాధించిన అతడి నుంచిఅభిమానులు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. ఎందుకంటే కోహ్లీ శతకం సాధించి16 నెలలు దాటిపోయింది.

Kranthi

Kranthi

Next Story