ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ జోరు

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లీ జోరు పెంచాడు.

Venkata Chari
Published on: 24 March 2021 8:26 PM IST
Virat Kohli in 1st Place in ODI and 4th in T20 in Icc Rankings
X
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (ఫొటో ట్విట్టర్)

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లీ జోరు పెంచాడు. టీ20ల్లో ఓ స్థానం మెరుగుపరుచుకోగా వన్డేల్లో నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన 5 టీ20ల సిరీస్‌లో 231 పరుగులు చేశాడు కోహ్లీ. అలాగే పుణె వేదికగా మంగళవారం జరిగిన మొదటి వన్డేలోనూ 56 పరుగులు చేశాడు. ఇక రెండో వన్డే శుక్రవారం మధ్యాహ్నం 1.30 కి పుణె వేదికగా మొదలుకానుంది.

టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానం నుంచి 4వ స్థానానికి విరాట్ కోహ్లీ ఎగబాకాడు. టాప్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలాన్ కొనసాగుతున్నాడు. అలానే ఇంగ్లాండ్‌తో ముగిసిన 5 టీ20ల సిరీస్‌లో 4 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా ఆడిన కేఎల్ రాహుల్ పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. దాంతో ర్యాంకింగ్స్‌లో 4వ స్థానం నుంచి 5 వ స్థానానికి రాహుల్ దిగజారాడు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో టీమిండియా బౌలర్ ఎవరూ చోటు దక్కించుకోలేకపోయారు.

ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 868 పాయింట్లతో నెం.1 స్థానంలోనే కొనసాగుతున్నాడు. 2వ స్థానంలో బాబర్ అజామ్, రోహిత్ శర్మ 3వ స్థానంలో ఉన్నారు. తొలి వన్డేలో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 2వ స్థానం నుంచి 3వ ప్లేస్ కి పడిపోయాడు.

Venkata Chari

Venkata Chari

Next Story