Virat Kohli: న్యూ లుక్‌లో విరాట్ కోహ్లీ..!

Virat Kohli: టీంఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు.

Arun Chilukuri
Updated on: 24 March 2023 7:16 PM IST
Virat Kohli Gets New Hair Cut Ahead Of IPL 2023
X

Virat Kohli: న్యూ లుక్‌లో విరాట్ కోహ్లీ..!

Virat Kohli: టీంఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఐపీఎల్ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో.. టీమిండియా రన్‌మెషీన్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కొత్త హెయిర్‌ కట్‌ తో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి. ఫొటోలు చూసిన అభిమానులు 'వావ్‌..', 'కోహ్లీ న్యూ లుక్‌ సూపర్‌' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్.. కోహ్లీకి ఈ కొత్త రూపాన్ని అందించారు. ఆలిమ్ ఒక్క కోహ్లీకే కాదు చాలా మంది సెలబ్రిటీలకు హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. తమ అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీకి సూపర్ హెయిర్ స్టైల్ సెట్ చేసిన ఆలిమ్‌కు ఫ్యాన్స్‌ థ్యాంక్స్‌ చెబుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story