Virat Kohli: రోహిత్ శర్మ విషయంలో విలేకరిపై విరాట్ కోహ్లి ఫైర్

* ప్రణాళికలు సరిగ్గా అమలు చేయనందుకే ఓడిపోయాము : కోహ్లి

Sandeep Reddy
Published on: 25 Oct 2021 1:21 PM IST
Virat Kohli Fires on Reporter About the issue of Rohit Sharma in Playing XI in India vs Pakistan Match
X

Virat Kohli: రోహిత్ శర్మ విషయంలో విలేకరిపై విరాట్ కోహ్లి ఫైర్

Virat Kohli: భారత్ - పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలవడానికి తాము అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోవడమే కారణమని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుండి చివరివరకు పాక్ ఆటగాళ్ళు మంచి ప్రదర్శన కనబరిచి టీమిండియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారని కోహ్లి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మ్యాచ్ లో మంచు ప్రభావం కూడా పాకిస్తాన్ జట్టు విజయానికి కలిసొచ్చిందన్నాడు.

మరోపక్క ఆదివారం మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు విరాట్ కోహ్లి ఫైర్ అయ్యాడు. పాకిస్తాన్ జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మకి బదులు ఇషాన్ కిషన్ ని జట్టులోకి తీసుకోవచ్చు కదా అన్న ప్రశ్నకి జట్టు కూర్పు గురించి అనవసరంగా మాట్లాడి వివాదాలు సృష్టించవద్దని.. వార్మప్ మ్యాచ్ లలో రోహిత్ శర్మ ప్రదర్శన మీకు కనిపించలేదా..? అంటూ విలేకరిపై విరాట్ కోహ్లి ఫైర్ అయ్యాడు. ఇక టీమిండియా తదుపరి మ్యాచ్ న్యూజిలాండ్ తో అక్టోబర్ 31 ఆదివారం రోజున సాయంత్రం 7.30 నిమిషాలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story