Team India: రోహిత్ కెప్టెన్సీలో నేను ఆడను.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కి కోహ్లి దూరం.!!

* చేతి గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కి దూరమైన రోహిత్ శర్మ

Sandeep Reddy
Updated on: 14 Dec 2021 1:02 PM IST
Virat Kohli Decided to Away from One day Series Against South Africa
X

Team India: రోహిత్ కెప్టెన్సీలో నేను ఆడను.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కి కోహ్లి దూరం.!!

Team India: టీమిండియాలో కెప్టెన్సీ విషయంలో ఆటగాళ్ళ మధ్య మరోసారి విభేదాలు మొదలైనట్లుగా తాజా పరిణామాలను చూస్తే అర్ధమవుతుంది. తాజాగా చేతి గాయంతో విరాట్ కోహ్లి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కి రోహిత్ శర్మ దూరమవగా.., రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించబోతున్న వన్డే సిరీస్ నుండి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లి బిసిసిఐ కి సమాచారం అందించినట్లు తెలుస్తుంది.

వన్డే కెప్టెన్సీ నుండి తనని తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆ విషయంపై స్పందించలేదు. కనీసం సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేయలేదు. అంతేకాకుండా కోహ్లి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని అతడి సన్నిహితులు కూడా చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే కెప్టెన్సీ నుండి పక్కనపెట్టడం అవమానంగా భావించిన విరాట్ కోహ్లీ త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలనున్నట్లు సమాచారం.

జనవరి 11న కోహ్లి కుమార్తె వామికా మొదటి పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నట్లు ఇప్పటికే కోహ్లి బీసీసీఐకి సమాచారమిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 11-15 వరకు దక్షిణాఫ్రికాతో చివరి టెస్ట్ మ్యాచ్ ముగిసిన తరువాతే వామికా బర్త్‌డే సెలెబ్రేషన్స్ చేస్తామని కోహ్లి చెప్పడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడటం ఇష్టంలేకే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story