logo
క్రీడలు

Virat Kohli: అరుదైన క్లబ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Virat Kohli Completes 200 Matches as a Captain
X

Virat Kohli: అరుదైన క్లబ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Highlights

Virat Kohli: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు.

Virat Kohli: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి భారత తరఫున 200వ మ్యాచ్‌కు సారథ్యం వహించిన జాబితాలో కోహ్లి చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న చివరిదైన మూడో వన్డే ద్వారా ఆ మార్కును చేరాడు. ఈ మ్యాచ్‌ కోహ్లికి కెప్టెన్‌గా 200వ మ్యాచ్‌. ఫలితంగా టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 200వ మ్యాచ్‌కు సారథ్యం వహించిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు. ఇక ఓవరాల్‌గా చూస్తే 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఎనిమిదో కెప్టెన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు.

Web TitleVirat Kohli Completes 200 Matches as a Captain
Next Story