IPL 2023: కింగ్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డ్.. కింగ్ ఆఫ్ చిన్నస్వామి..!

Virat Kohli: కింగ్ కోహ్లీ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.

Arun Chilukuri
Updated on: 27 April 2023 1:00 PM IST
Virat Kohli Achieves Unique Milestone At Chinnaswamy Stadium
X

IPL 2023: కింగ్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డ్.. కింగ్ ఆఫ్ చిన్నస్వామి..!

Virat Kohli: కింగ్ కోహ్లీ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ కి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 201 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 179 పరుగులే చేసి చేతులెత్తేసింది. చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.

కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ ఓడినప్పటికీ ఆ టీమ్ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించి అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో టీ20 ఫార్మాట్ లో 3వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ప్రసుత్త ఐపీఎల్ లో కోహ్లీకి ఇది 5వ హాఫ్ సెంచరీ. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్ టీమ్ లపై కోహ్లీ అర్థశతకాలు బాదాడు. ఇకపోతే ఈ ఐపీఎల్ సీజన్ లో 300 పరుగులు దాటిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ గా కూడా కోహ్లీ నిలవడం విశేషం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story