సచిన్ రికార్డు పైన కన్నేసిన కోహ్లి.. కేవలం 23 పరుగుల దూరంలోనే!

సచిన్ రికార్డు పైన కన్నేసిన కోహ్లి.. కేవలం 23 పరుగుల దూరంలోనే!
x
Highlights

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టాడు. తాజాగా మరో రికార్డు పైన కన్నేశాడు. కోహ్లి మరో 23 ప‌రుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల ప‌రుగులు పూర్తి చేసిన ప్లేయ‌ర్‌గా కోహ్లి రికార్డు సృష్టిస్తాడు

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టాడు. తాజాగా మరో రికార్డు పైన కన్నేశాడు. కోహ్లి మరో 23 ప‌రుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల ప‌రుగులు పూర్తి చేసిన ప్లేయ‌ర్‌గా కోహ్లి రికార్డు సృష్టిస్తాడు. అదే క్రమంలో ఇండియన్ టీం మాజీ క్రికెటర్ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌ రికార్డును అధిగమిస్తాడు. బుధ‌వారం ఆసీస్ తో జ‌ర‌గ‌బోయే మూడో వ‌న్డేలో మ‌రో 23 పరుగులు చేసి కోహ్లి ఈ ఘనతను అందుకుంటాడని అందరూ భావిస్తున్నారు.

ఈ ఘనతను కోహ్లి సాధిస్తే వ‌న్డేల్లో 12 వేల ప‌రుగులు చేసిన వారిలో ఆరో ఆటగాడిగా నిల‌వ‌నున్నాడు. కోహ్లికి ముందు స‌చిన్‌, రికీ పాంటింగ్‌, కుమార సంగ‌క్కర‌, స‌నత్ జ‌య‌సూర్య‌, మ‌హేల జ‌య‌వ‌ర్దనె ఉన్నారు. ఇక రేపు ఆసీస్ తో జరగబోయే మూడో వన్డేలో కోహ్లి సెంచరీ సాధిస్తే అత్యధిక సెంచ‌రీలు చేసిన ( తొమ్మది సెంచరీలు ) చేసిన ఆటగాడిగా సచిన్ సరసన నిలుస్తాడు.

ఇక ఆసీస్ పర్యటనలో ఉన్న భారత్ అక్కడ జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు వన్డేల్లో భారత్ ఓటమి పాలు అయింది. అయితే రెండు వన్డేల్లో భారత్ ఓటమికి బౌలర్ల వైఫల్యమే కారణమని చెప్పాలి. బ్యాట్స్‌మన్‌ సమిష్టి ఆటతీరు బాగానే ఉన్నా.. బౌలింగ్‌ విభాగం సమస్యగా మారింది. ఇక మూడో వన్డేల్లో యార్కర్ల కింగ్‌ నటరాజన్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories