Viral Video : ఇలాంటి చెత్త ఫీల్డింగ్ మీరెప్పుడైనా చూశారా..?

Viral Video: క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి.. క్రికెట్ లో కీ రోల్ ఫీల్డింగ్ దే అని అర్థమవుతోంది.

Venkata Chari
Published on: 12 March 2021 4:31 PM IST
Viral video Have You ever seen such Worst Fielding in cricket
X

వైరల్ వీడియో (ఫొటో ట్విట్టర్)

Viral Video: క్రికెట్ లో ఫీల్డింగ్ అనేది చాలా కీలకం. ఫీల్డింగ్ లో ఫెయిల్ అయిన జట్లు కీలక మ్యాచ్ లను చేజార్చుకోవడం మనం చేసే ఉంటాం. క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి తో ఫీల్డింగ్ ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుందో అర్థమవుతోంది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఫీల్డింగ్ ను మీరు ఎక్కడా చూసి ఉండరు. యూరోపిన్ క్రికెట్ సిరీస్ లో ఓ చెత్త ఫీల్డింగ్ వీడియో వైరల్ గా మారింది. దీనిని మిచెల్ వాన్ తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో కామెంట్లతో ఓ ఆట ఆడేసుకుంటున్నారు యూజర్లు.

ఇక వీడియో సంగతికి వస్తే.. ఒకే బంతికి మూడు సార్లు ఔటయ్యే అవకాశం చేజార్చుకున్నారు బౌలింగ్ టీం. దీంతో ప్రత్యర్థికి నాలుగు పరుగులు అప్పనంగా ఇచ్చేశారు. ఐరోపా క్రికెట్‌ సిరీస్‌లో వర్మడో సీసీ, స్టాక్‌హోం సూపర్‌ కింగ్స్‌ మధ్య ఓ మ్యాచ్‌ జరిగింది. స్టాక్‌హోం ఆటగాడు కీపర్‌ వెనక్కి బంతిని ఆడాడు. కానీ కీపర్‌ చేతులో పడిని బంతిని సరిగా పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక చెత్త ఫీల్డింగ్ కి నాంది పడింది ఇక్కడే. ఇంతలో బ్యాట్ మెన్స్ పరుగులు తీయడం ప్రారంభించారు. కీపర్‌ బౌలర్‌ వైపు బంతి విసిరాడు. అతడూ పట్టుకోలేదు. దాంతో మరో పరుగు అందుకున్నారు బ్యాట్ మెన్స్. లాంగాన్‌లోని ఫీల్డర్‌ బంతిని విసరగా మరలా ఎవ్వరూ పట్టుకోలేదు. ఇలా బ్యాట్ మెన్స్ నాలుగు పరుగులు తీసి ఔరా అనిపించారు. ఇక పరుగులు తీయలేక ఆయాసం వచ్చి ఆగిపోయారు. ఇలాంటి ఫీల్డింగ్‌కు ఎన్నో రన్స్ తీసినా ఆశ్చర్యమేమీ లేదు.

ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాంటి వీడియోను మీరూ చూసి నవ్వుకోండి...


Venkata Chari

Venkata Chari

Next Story