IPL 2021 Punjab vs Hyderabad: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

IPL 2021 Punjab vs Hyderabad: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది.

Venkata Chari
Updated on: 21 April 2021 4:34 PM IST
Toss Won by Punjab Kings and Choose Batting
X

పంజాబ్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ టీంల మధ్య మ్యాచ్

IPL 2021 Punjab vs Hyderabad: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. ఈ మేరకు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇంతవరకు టోర్నీలో పాయింట్ల ఖాతా తెరవలేదు ఎస్‌ఆర్‌హెచ్‌ టీం. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు మార్పులు చేసింది ముజీబ్‌, అబ్దుల్‌ సమద్‌, మనీష్‌ పాండేల స్థానంలో కేన్‌ విలియమ్సన్‌, కేదార్‌ జాదవ్‌, సిద్దార్థ్‌ కౌల్‌లు తుది జట్టులో చేరారు. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో మెరిడిత్‌, జై రిచర్డ్‌సన్‌ స్థానంలో పాబియన్‌ అలెన్‌, మెయిసిస్‌ హెన్రిక్స్‌ తుది జట్టుతో జాయిన్ అయ్యారు.

ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 16 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించగా.. మిగిలిన 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది.

ప్లేయింగ్ లెవన్

పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌)‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, నికోలస్‌ పూరన్‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌,పాబియన్‌ అలెన్‌, మెయిసిస్‌ హెన్రిక్స్, మురుగన్‌ అశ్విన్‌‌, షమీ, అర్షదీప్‌ సింగ్‌

ఎస్‌ఆర్‌హెచ్‌: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), కేన్‌ విలియమ్సన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్ శంకర్, జానీ బెయిర్‌ స్టో, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్,అభిషేక్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, విరాట్‌ సింగ్‌, సిద్దార్థ్‌ కౌల్

Venkata Chari

Venkata Chari

Next Story