IPL 2021 MI vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్

IPL 2021 MI vs KKR: ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోరుకి రంగం సిద్ధమైంది.

Venkata Chari
Published on: 13 April 2021 7:11 PM IST
Toss Won by Kolkata Knight Riders and Choose Bowling
X

టాస్ వేస్తున్న కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021 MI vs KKR: ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోరుకి రంగం సిద్ధమైంది. నేడు జరగనున్న ఐదో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడునున్నారు. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం బౌలింగ్ తీసుకుంది. ముంబయి ఇండియన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోరంగా ఓడిపోయింది ముంబయి ఇండియన్స్. ఇక తన రెండో మ్యాచ్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడబోతోంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 10 పరుగుల తేడాతో గెలిచింది. హిట్టర్లతో నిండిని ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

ప్లెయింగ్ లెవన్

కోల్‌కతా నైట్‌రైడర్స్ : నితీష్ రానా, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (కీపర్), షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.

ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, మార్కో జాన్సెన్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Venkata Chari

Venkata Chari

Next Story