Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ముగిసిన దీపికా పోరాటం

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి పోరాటం ముగిసింది.

Arun Chilukuri
Published on: 30 July 2021 2:57 PM IST
Tokyo Olympics: Archer Deepika Kumari Knocked Out
X

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ముగిసిన దీపికా పోరాటం

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి పోరాటం ముగిసింది. ఆర్చరీ రికర్వ్ విభాగంలో క్వార్టర్స్‌ వరకు వెళ్లిన దీపికా.. క్వార్టర్స్‌లో అంతగా రాణించలేకపోయింది. దీంతో దీపికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. కొరియా ఆర్చర్‌ ఆన్‌సాన్‌తో జరిగిన పోటీల్లో దీపికా కుమారి 6-0తో ఓటమి పాలైంది. వరల్డ్ నెం.1 ర్యాంక్‌లో ఉన్న దీపికా కుమారి.. కెరీర్‌లో మూడో సారి ఒలింపిక్స్‌లో పోటీపడిన దీపికా కుమారికి మళ్లీ రిక్త హస్తమే ఎదురైంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ప్రీ‌క్వార్టర్‌ఫైనల్స్‌లో వెనుదిరిగిన దీపికా కుమారి 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫస్ట్ రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story