Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ.. కరణం మల్లీశ్వరి తర్వాత..

Tokyo Olympics 2020: Mirabai Chanu Wins Silver Medal in Weightlifting
x

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ

Highlights

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట మొదలైంది. వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చాను భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట మొదలైంది. వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చాను భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. మహిళల 49కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి తొలి పతకం సాధించింది. ఈ పతకంతో భారత్ తరపున వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించిన రెండో భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది మీరాబాయ్ చాను.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది మీరాబాయి చాను. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఒలింపిక్స్‌ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చేసింది. చిరస్థాయిగా నిలిచే ఘనత అందుకుంది. యావత్‌ దేశంతో శెభాష్‌ అనిపించుకుంటోంది. ఇండియాను సగర్వంగా తలెత్తుకునేలా చేశావంటూ ఇతర క్రీడాకారులు ఆకాశానికెత్తారు.

మీరాబాయ్‌ టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలవడంతో ఆమెకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌లో మీరాబాయి అద్భుత ప్రదర్శనతో యావత్‌ భారతం ఉప్పొంగిపోతుందన్నారు ప్రధాని మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories