IND Vs WI: నేడు భారత్‌-వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్

IND Vs WI: క్లీన్ స్వీప్‌ చేయాలనే పట్టుదలతో టీమిండియా, నేటి మ్యాచ్‌ వెస్టిండీస్‌కు కీలకం.

Sriveni Erugu
Published on: 18 Feb 2022 7:36 AM IST
Today is The Second T20 Match Between India And The West Indies
X

IND Vs WI: నేడు భారత్‌-వెస్టిండీస్‌ రెండో టీ20 మ్యాచ్

IND Vs WI: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా టీ20 సిరీస్‌ను కూడా కొట్టేయాలని చూస్తోంది. ఇందుకు కేవలం సింగల్‌ విక్టరీ దూరంలోఉంది. భారత పర్యటనలో వెస్టిండీస్‌ ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు ఆడితే ఒక్క దాంట్లోనూ గెలిచింది లేదు. గత నాలుగు మ్యాచ్‌ల నుంచి బరిలోకి దిగిన ప్రతిసారీ భారత్‌ గెలవడం విండీస్‌ ఓడడం పరిపాటిగా మారింది.

అయితే ఈరోజు జరిగే రెండో టీ20 వారికి కీలకం కానుంది. సిరీస్‌లో నిలవాలంటే కరీబియన్లు ఈ మ్యాచ్‌ కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వాలనుకుంటోంది. అటు భారత్‌ మాత్రం వరుసగా ఏడు టీ20 విజయాలతో అదరగొడుతోంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఫుల్‌ జోష్‌లో ఉన్న జట్టు రెండో మ్యాచ్‌తోనే సిరీస్‌ను వశం చేసుకునే ఆలోచనలో ఉంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story