ఇవాళ భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే

IND Vs WI: అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 1.30 గం.కు మ్యాచ్, మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్.

Sriveni Erugu
Published on: 9 Feb 2022 9:34 AM IST
Today is the second ODI between India and the West Indies
X

ఇవాళ భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే

IND Vs WI: టీమిండియా వన్డే సిరీస్‌పై గురి పెట్టింది. వెస్టీండిస్‌తో నేడు రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. దీంతో రెండో వన్డేలో ఒత్తిడి లేకుండా ఆడనుంది. మరోవైపు కరేబియన్ జట్టు.. ఇండియా దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. పవర్ హిట్టర్లు ఉన్నా.. విండీస్ జట్టు చెలరేగకుండా భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. ఇక రెండో వన్డేలో కూడా స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఇక రోహిత్ శర్మకు జోడిగా.. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఒక వేళ రాహుల్ తుది జట్టులోకి తీసుకోకుంటే తొలి వన్డే లాగే ఇశాంత్ కిషన్ ఓపెనింగ్ చేసే చాన్స్ కనిపిస్తోంది. మొదటి వన్డే జరిగిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే రెండో వన్డే కూడా జరగనుంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story