నేడు భారత్, వెస్డిండీస్ ఆఖరి వన్డే

IND Vs WI: క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా.

Sriveni Erugu
Published on: 11 Feb 2022 9:28 AM IST
oday is the final ODI between India and the West Indies
X

నేడు భారత్, వెస్డిండీస్ ఆఖరి వన్డే

IND Vs WI: వెస్డిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌పై గురిపెట్టింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకున్న టీమ్‌ఇండియా.. ఇవాళ జరిగే చివరి వన్డేను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తుంది. సొంత గడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న రోహిత్ సేన.. కరెబియన్ జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. వరుసగా 11వ సారి ద్వైపాక్షిక సిరీస్‌ను తమ ఖాతాలో వేసింది. ఇక ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని విండీస్ భావిస్తోంది. మరోవైపు రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న ధవన్ తిరిగి జట్టులోకి రాగా.. పలు మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది. మొదటి రెండు వన్డేలు జరిగిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చివరి వన్డే కూడా జరగనుంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story